Friday 15 February 2013

రా.. రా రా రామయ్యా, ఎనిమిదిలో లోకముంది రావయ్యా


బాషా సినిమా లో 'రా.. రా రా రామయ్యా, ఎనిమిదిలో లోకముంది రావయ్యాఅనే పాట గుర్తుందా! సరే,ఎనిమిదిలో లోకము ఏమి ఉందో గాని, ఎనిమిది మీద పదాలు ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాము అనిపించిందిఎనిమిది అంటే 'అష్టము'. 'అష్ట' తో మొదలయ్యే పదాలు ఏమిటి గుర్తువున్నాయో ఆలోచిస్తూ పోతే, ఒక పది పన్నెండు గుర్తుకు వచ్చాయి. తర్వాత మన facebook ఫ్రెండ్స్ తో కలిసి అలా అలా గుర్తు చేసుకుంటూ పోయి మొత్తానికి లెక్కని 33 చేసాము. పదాలన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను:

అష్టపది,అష్టావధానం,అష్ట లక్ష్మి,అష్ట దిక్కులు,అష్టైశ్వర్యాలు ,అష్టకష్టాలు
అష్టదరిద్రాలు ,అష్టోత్తర స్తోత్రము,అష్టదిగ్గజాలు ,అష్టదిగ్బంధనం ,అష్టమ శని
అష్టదళపద్మము,అష్టకం,అష్టాచమ్మా,అష్టగ్రహకూటమి,అష్టమచంద్రుడు
అష్టమి,అష్టభుజి,అష్టదిక్పాలకులు,అష్ట వినాయకులు, అష్టమ సంతానం,
అష్ట భార్యలు (శ్రీకృష్ణుడికి) , అష్ట వంకర్లు (సిగ్గుతో పెళ్ళికూతురు చేసేవి),
అష్టమ స్కంధము (ఎనిమిదవ అధ్యాయం), అష్టమ సిద్దులు,కృష్ణాష్టమి(కృష్ణుని జన్మదినం)
అష్ట మూర్తులు, అష్ట ధాతువులు,అష్ట అర్ఘ్యాలు,అష్ట చిరంజీవులు,అష్టవిధవివాహాలు,అష్టజన్మలు, కృష్ణాష్టమి.

ఐతే, ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, శ్రీకృష్ణుడికి - ఎనిమిదికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించడం:
శ్రీకృష్ణ - అష్ట సంబంధం:
కృష్ణావతారం - విష్ణువు యొక్క దశావతారాలలో ఇది ఎనిమిదవ అవతారం 
శ్రీకృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం (తెలుగు మాసం లో ఎనిమిదవ రోజు)
అష్టమ సంతానం - దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు
అష్ట భార్యలు (అష్ట మహిషులు)- కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు  
ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలియదు మరి...

No comments:

Post a Comment