Sunday 3 February 2013

మా అమ్మమ్మ జ్ఞాపకాలు ....

అమ్మమ్మ అనగానే గుర్తుకు వచ్చేవి సంగీతం, వీణ, సూర్య కళామందిరం, మజ్జిగ పులుసు, చక్కెరపొంగలి, ఫోస్ఫోమిన్, చిన్న చిన్న విసుర్లూ, సరదా మాటలూనూ...
 
చాగంటి సీతా మహాలక్ష్మిఅమ్మమ్మ  పేరు. అమ్మమ్మ ఇవటూరి వారి ఆడపడుచు. ఐ. పోలవరం దగ్గరి గుత్తిందీవి అమ్మమ్మ స్వస్థలం. మా తాతగారు డాక్టర్ చాగంటి తిరుమలరావు గారితో వివాహానంతరం ఆయన  ఉద్యోగరీత్యా వారు వివిధ ప్రదేశాలలో ఉండి, మాకు బాగా తెలిసే సరికి కాకినాడ లో సెటిల్ అయ్యారు. మా తాతగారు,అమ్మమ్మ లకి ఐదుగురు సంతానం- ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. మా అమ్మ వారి ప్రధమ సంతానం. మా అమ్మకి జన్మనిచ్చిన తర్వాత అమ్మమ్మకి లైట్ గా పక్షవాతం వచ్చిందని, అందువల్ల అమ్మమ్మ కుడి చెయ్యి వీక్ అయ్యిందని, అలానే జనరల్ వీక్నెస్ వచ్చిందని అనేవారు. బలం  కోసం అమ్మమ్మ  ఫోస్ఫోమిన్ టానిక్ మందు రోజు పుచ్చుకోనేది. మేము స్క్విబ్ మోహన్ గారింటి కెళ్ళి టానిక్ బాటిల్స్ తెచ్చే వాళ్ళం

అమ్మమ్మకి సంగీతం చాలా ఇష్టం. ఎక్కువగా వీణా సాధనం చేస్తూ వుండేది. వోకల్ నేర్చుకోవటానికి సీతమ్మ రావు గారి దగ్గరికి వెళ్ళటం నాకు బాగా గుర్తు.నాకు తెలిసినంతవరకూ చాలా మంది  దగ్గర  శిష్యరికం చేసింది.అమ్మమ్మకి ఛలోక్తుల సరదా బాగా ఉండేది."తమ్మారావు గారి దగ్గరికి వెళ్లి వస్తానురా" అనేది. పెళ్ళిళ్ళల్లో సరదాగా పాడే "మీరు కూడా వచ్చేసారా మీ మొహం మండ " లాంటి పాటలు కూడా పాడేది .

కొన్ని విషయాలలో ఆవిడికి మొహమాటం లేదు. చాలా ఖచ్చితంగా మొహం మీదే చెప్పేసేది.కాని ఆమె ఆప్యాయత గురించి తెలిసినవారికి ఆమె మాటలు నొప్పించేవి  కావు.ఆవిడ సంగీత సాధనకి తాతగారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.నాకు తెలిసి ఆవిడకి సంగీతం మీద వున్న  ఇష్టం మాత్రమే తన పెద్ద వయసులో కూడా లేని ఓపికని తెచ్చి తన సంగీత సాధనకి , మ్యూజిక్ షో లకి వెళ్ళటానికి తోడ్పడి ఉంటుంది.సూర్యకళా మందిరానికి ఎన్నో మ్యూజిక్ షో లు చూడడానికి వెళ్ళేది.అమ్మమ్మ young at heart.

పొద్దున్నే ఇంటి  దగ్గర పితికిన గేదె పాలతో అమ్మమ్మ చేసే కాఫీ పడితే గాని ఇంట్లో ఎవరికీ ఓపిక వచ్చేది కాదు. అమ్మమ్మ కాఫీ కోసం ఒకరిద్దరు చుట్టాపక్కాలు కూడా పేపర్ చదివే నెపంతో మాఇంట్లో వాలిపోవడం,అమ్మమ్మ కాఫీ కలుపుతూ చిన్నగా విసుక్కోవడం మాకు పరిపాటేఅమ్మమ్మ ప్రతీ శనివారం చేసే మజ్జిగపులుసు రుచి ఎన్నడూ మరువలేము. నాకు తెలిసి రుచి మరెవరు చేసినా రాదు. అది గేదేపాల మహిమో లేక అమ్మమ్మ చేతి మహిమో ఒక మిస్టరీయేమరి.(పాల మహిమా లేక పాళ్ళ మహిమా?)

నేను అమ్మమ్మ దగ్గిర చేరి మరీమరీ పాడించుకుని విన్న కీర్తనలు అప్పుడప్పుడు గుర్తు వస్తూ వుంటాయి.
రామా కోదండరామా..
ముద్దుగారే యశోదా...
ఒకపరి కొకపరి.....
కొండలలో నెలకొన్న .....
విన్నపాలు వినవలె ....
రామచంద్రాయజనక....
అమ్మమ్మ చివరిసారిగా హాలు కు వెళ్లి చూసిన సినిమా కూడా సంగీత ప్రధానమైనదే - 'అన్నమయ్య' (1997).

అమ్మమ్మకి దీపావళి అంటే బాగా సరదా. టపాసులు కాల్చడానికి ముందు పిల్లలందరి చేత గోంగూర కాడలతో 'దివ్వి దివ్వి దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి ' అని అంటూ కొట్ట్టించేది. అరుగు మీద కూర్చుని తాటాకు టపాకాయలు టక టక వేస్తూ వుండేది

నేను సైకిల్ సరదాతో ఎదురుగా వుండే ఫణి జనరల్ స్టోర్స్ కి కూడా సైకిల్ పైనే వెళ్లి వచ్చేవాడిని.అలాంటప్పుడు అమ్మమ్మ అనే మాటలు  ఎంతో  సరదాగా ఉండేవి 'అరే  సైకిల్ ఎందుకురా ? సైకిల్ మీద వెళ్తే నీ తో పాటు సైకిల్ ని కుడా మొయ్యాలి కదరా!.'. 
 ఆవిడ మా ఇంటికొచ్చే ఒక చెవిటాయన గురించి చెప్తూ ఆయన పెద్ద  'సౌండ్ ఇంజనీర్' అనేది.

          చివరగా అమ్మమ్మ తాతగార్ల అనుబంధం  గురించి చెప్పకుండా ముగించలేను .అమ్మమ్మ ఏమి చేసినా ఆయనకు ఆనందమే. పనికి అడ్డు చెప్పేవారు కాదు.అదేవిధంగా అమ్మమ్మ కి ఆయన మీద ఎంతో  అభిమానం . తాతగారు కాలం చేసిన ఏడాదికే అమ్మమ్మ కూడా మాకు దూరం అయ్యింది. ఏడాది అమ్మమ్మ ఎప్పటి అమ్మమ్మ లా లేదు. ఆవిడకి బాగా ఇష్టం అయిన సంగీతం, వీణ కూడా అమ్మమ్మ బెంగని తగ్గించలేదు.

5 comments:

  1. Great Memory Research Initiative - MRI. Good going. Extend the initiative to other beloved immortal souls. All The Best.
    Raghu

    ReplyDelete
    Replies
    1. Hi Raghu babaigaru, new definition for MRI is good. I remember you very much for this type of funny word-comments.
      Thanks for the wishes

      Delete
  2. I would like to quote Kalyani's comments here:
    Tatagaru always addressed Bammagaru as 'Madam' and their bond was strong and sweet. I cannot forget the burelu that bammagaru used to make and the grand vara lakshmi vratham perantams. She was a fun-loving person and loved to watch both the sunday afternoon (no matter what language) and evening films on Doordarshan. We had a good time during our trips to Kirlampudi and Pulletikurru with her.

    ReplyDelete
  3. I would like to quote Mythili's comments:

    I could visualize bammagaru, our house in KKD, Tulasi & Mandara chettu, Phani General Stores - Very descriptive.

    I remember bammagaru and our pedda ammamma (PDA) exchanging cooking recipes and discussing several rituals and our culture. Those were the days before the mega serials ect were introduced on TV and both of them liked to talk about Mahabhartam, Ramayanam and their understanding of the pitta kadhalu.

    I also appreciate how bammagaru was very health conscious even in those days - Making us eat brown rice, idly for break fast, pappu every day and treating us with vindu bhojanam on festive days and sundays.

    Your article brought back very good memories - Tire Aata.

    ReplyDelete
  4. Hi SANKAR
    CHALA BAGA RASAVU AMMAMMA NI GURUNCHI - I WISH YOU COULD HAVE KEPT ONE OR TWO PHOTOS
    ME AMMAMMA PELLILLO CHALA BAGA VIYYALAVARI MEEDHA PADETHE
    MA AMMAI SUDHA PELLILO 1996 JAN 26 TH PADINDHI

    ReplyDelete