Tuesday 12 March 2013

నిదానమే ప్రధానము....

నిదానమే ప్రధానము, Road King, Keep Distance, తొందరపడకు సుందరవదనా,
Go  Slow,
జై మాతా దీ, .....
వీటిని చూస్తే మీకు ఏమి గుర్తు వస్తుంది?
ఇవి లారీల పైన, బస్సులపైన వెనక వైపు రాసి వుంటాయి కదా! ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవారికి బాగా కనపడతాయి.


      ఇక సిటీ లలో ఆటోలు,బైక్ పై నైతే ఎన్ని రకాల రాతలో చెప్పలేము. 4 in All, Auto Taxi, For Hire,MINI TAXI  - ఇవి అన్నీ ఒక category అయితే, On Govt Duty, On Defense Duty, పనిచేసే company పేర్లు లాంటివి మరొక variety. అమ్మ దీవెన, Mom's Gift, Dad's Gift అంటూ కృతజ్ఞ్యత చాటేవి కొన్ని అయితే మరి కొన్ని పిల్లల పేర్లను తెలుపుతూ ప్రేమను చాటేవి.

ఇవే కాకుండా, Educational Institutions, Product promotion కోసం పెట్టె బోర్డులు కూడా ఎన్నో కనపడతాయిఇక సినిమాల మీద అభిమానం అయితే ఎంతో కనపడుతుందిఏది వదలకుండా, NTR నటించిన దొంగరాముడు దగ్గర నించి పాత, కొత్త పేర్లు ఎన్నో కనపడతాయిఇక ప్రిన్స్ మహేష్, రెబెల్ స్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ అని వారి వారి అభిమాన హీరోలు హీరోయిన్ పై చేసిన బోర్డులు అయితే కోకొల్లలు.   

నాకు అనిపించినది ఏమిటంటే సాధారణంగా పేర్లు అన్ని దిష్టి తగలకూడదు అనే ఉద్దేశ్యం తో పెట్టినవి, వేగం వలన అనర్ధం జరగకూడదు అనే ఉద్దేశ్యం తో పెట్టినవి, Information ఇచ్చే ఉద్దేశ్యం తో పెట్టినవి, అభిమానాన్ని చాటేవి, Government Rules కోసం  పెట్టినవి, Advertisement  కోసం  పెట్టినవి అయి వుంటాయి.

చివరగా ఒక విషయం చెప్పాలినాకు ఇది రాయడానికి ప్రధాన కారణం 'తొందర పడకు సుందర వదనా' అనే వాక్యం అయితే, నాకు ఎప్పుడు చూసినా బాగా మండుకొచ్చే వాక్యం - 'నన్ను చూసి ఏడవకురా'.
మీకు కూడా ఏమైనా ఇటువంటి వాక్యాలు సరదాగా అనిపిస్తే comments లో వ్రాయండి...