Sunday, 17 February 2013

పల్లెటూరి రుచులు

ఒకసారి పల్లెటూరి రుచులు గుర్తు చేసుకుందాం. ఇది సాంతం చదివిన తర్వాత మీరు నన్ను వీడు ఇంత తిండిపోతా? అని ముక్కున వేలేసుకుంటారని తెలిసినా, నేను రాయకుండా ఉండలేకున్నానుఇక తిన్నగా విషయానికి వస్తే,...
  
తాటి ముంజలు, కాల్చిన తాటి పళ్ళు, తాటి తాండ్ర
చెరుకు గడలు - బళ్ల పైన తీసుకు వెళ్ళేటప్పుడు వెనకాలనుండి తెలీకుండా లాగడం
కొబ్బరి బొండాలు, కొబ్బరి పువ్వు (ఇది చాలా స్పెషల్ - ఎక్కువగా దొరకదు)
పనస తొనలు,సీతాఫలాలు
అరటిపళ్ళు- ఐదు పైసల పళ్ళు లేదా ప్రసాదం పళ్ళు అని పిలిచే చిన్నగా ఉండే పచ్చ అరటి పళ్ళు, రిచ్-టేస్ట్ కలిగి ఉండే చక్రకేళి అరటిపళ్ళు
మామిడి పళ్ళు- కొన్ని ప్రదేశాలలోనే పండే కొత్తపల్లికొబ్బరి వెరైటీ మామిడి పళ్ళు
కొంచెం పులుపు,కొంచెం వగరు గా ఉండే రేగు పళ్ళు, ఈత పళ్ళు 
చింత కాయలు,మామిడికాయలు - చెట్లపైకి రాళ్ళతో కొట్టి, ఉప్పుకారం కలిపి తినడం 
 
అప్పడాల పిండి, బామ్మలు డాబాల పై ఆరబెట్టే బూడిదగుమ్మడికాయ ఒడియాలు, ఊరి మిరపకాయలు 
పెళ్ళిళ్ళలో వియ్యాలవారు మరీ మరీ అడిగి చేయించుకునే -అరటిదూట కూర, పనసపొట్టు కూర

సైకిల్ మీద 'ఐస్-పాలైస్' అంటూ అరుస్తూ తెచ్చే-రంగురంగుల ఐస్ప్రూట్ - పుల్ల-ఐస్, పాల-ఐస్, సేమ్యా-ఐస్
'
సోడాయ్-సోడాయ్' అంటూ తోపుడు బండి పై తెచ్చే- గోళీ సోడా, నిమ్మ సోడా, కలర్ సోడా
సైకిల్ మీద అద్దాల బాక్స్ లో పెట్టి తెచ్చే -సోం పాపిడి,పీచు-మిఠాయి,పాలకోవా
మొక్కజొన్న కండెలు, తేగలు
కొన్నిచోట్ల మాత్రమే వండే -పోకుండలు,పాకం కజ్జికాయలు

రోడ్డుపక్కన బండ్లపై అమ్మే టిఫిన్స్:
ఇడ్లి,మినపట్టు -తెల్ల పచ్చడి,కారం పచ్చడి
పూరి-శనగపిండికూర
మిరపకాయ్,అరటికాయ్,టమాటో బజ్జీలు,ఉల్లి పకోడీ
బండిపై అమ్మే గాజు గ్లాస్ టీలు
చిక్కని పాలతో చేసే నురగలు కక్కే వేడి వేడి కాఫీ 

చిక్కని పాలు,కమ్మని పెరుగు, మీగడ,వెన్న, జున్ను
ఇక వేసవి కాలం వస్తే, ఆవకాయ,మాగాయ పచ్చళ్ళు సందడి.

గుళ్ళళ్ళొ ఇచ్చే ప్రసాదాలు - చక్కెరపొంగలి,పులిహోర,దద్దోజనం

Friday, 15 February 2013

రా.. రా రా రామయ్యా, ఎనిమిదిలో లోకముంది రావయ్యా


బాషా సినిమా లో 'రా.. రా రా రామయ్యా, ఎనిమిదిలో లోకముంది రావయ్యాఅనే పాట గుర్తుందా! సరే,ఎనిమిదిలో లోకము ఏమి ఉందో గాని, ఎనిమిది మీద పదాలు ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాము అనిపించిందిఎనిమిది అంటే 'అష్టము'. 'అష్ట' తో మొదలయ్యే పదాలు ఏమిటి గుర్తువున్నాయో ఆలోచిస్తూ పోతే, ఒక పది పన్నెండు గుర్తుకు వచ్చాయి. తర్వాత మన facebook ఫ్రెండ్స్ తో కలిసి అలా అలా గుర్తు చేసుకుంటూ పోయి మొత్తానికి లెక్కని 33 చేసాము. పదాలన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను:

అష్టపది,అష్టావధానం,అష్ట లక్ష్మి,అష్ట దిక్కులు,అష్టైశ్వర్యాలు ,అష్టకష్టాలు
అష్టదరిద్రాలు ,అష్టోత్తర స్తోత్రము,అష్టదిగ్గజాలు ,అష్టదిగ్బంధనం ,అష్టమ శని
అష్టదళపద్మము,అష్టకం,అష్టాచమ్మా,అష్టగ్రహకూటమి,అష్టమచంద్రుడు
అష్టమి,అష్టభుజి,అష్టదిక్పాలకులు,అష్ట వినాయకులు, అష్టమ సంతానం,
అష్ట భార్యలు (శ్రీకృష్ణుడికి) , అష్ట వంకర్లు (సిగ్గుతో పెళ్ళికూతురు చేసేవి),
అష్టమ స్కంధము (ఎనిమిదవ అధ్యాయం), అష్టమ సిద్దులు,కృష్ణాష్టమి(కృష్ణుని జన్మదినం)
అష్ట మూర్తులు, అష్ట ధాతువులు,అష్ట అర్ఘ్యాలు,అష్ట చిరంజీవులు,అష్టవిధవివాహాలు,అష్టజన్మలు, కృష్ణాష్టమి.

ఐతే, ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, శ్రీకృష్ణుడికి - ఎనిమిదికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించడం:
శ్రీకృష్ణ - అష్ట సంబంధం:
కృష్ణావతారం - విష్ణువు యొక్క దశావతారాలలో ఇది ఎనిమిదవ అవతారం 
శ్రీకృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం (తెలుగు మాసం లో ఎనిమిదవ రోజు)
అష్టమ సంతానం - దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు
అష్ట భార్యలు (అష్ట మహిషులు)- కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు  
ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలియదు మరి...